26 సింగూర్ మరియు నందిగ్రామం భూవివాదం సింగూర్ మరియు నందిగ్రామం లో లెఫ్ట్ పార్టీల భూసేకరణ సిద్ధాంతాల గురించీ, మరియూ వాటిపట్ల భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ వ్యతిరేకత గురించీ తెలిపే పత్రాలను కనుగొనుము. సింగూర్ మరియు నందిగ్రామం లలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి కోసం చేజిక్కించుకున్న వ్యవసాయ భూములను గురించి, లెఫ్ట్ పార్టీలకూ, ప్రతిపక్షములకూ ఉన్న తగాదాలు, ఈ సిద్ధాంతం కారణంగా బలైన అమాయకుల గురించీ, మహిళల పట్ల అత్యాచారాలు, మరియు భిన్న వర్గాలకు చెందిన ప్రజల వ్యతిరేకత, విమర్శల కు సంబంధించిన పత్రాలు అన్నీ సంబంధితమైనవే. 27 భారత చైనా సంబంధాలు ఆర్థిక, మంత్రాంగ సంబంధిత, శాస్త్ర, సాంకేతిక, పౌరవిమానయాన విషయాల్లో భారత చైనా ద్వైపాక్షిక సంబంధాల గురించి యుద్ధాన్నీ, శాంతినీ రెండింటినీ చూసిన భారత చైనా ల మధ్య సంబంధాల గురించి, అక్సయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ లకు సంబంధించిన సరిహద్దు వివాదం, రెండు దేశాల మధ్యా ఆర్థిక, వాణిజ్య మరియు సాంకేతిక సహాయ సహకారాలూ, మంత్రాంగ పరమైన మారకం వంటి సమాచారమంతా సంబంధితమే. 28 ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం మరియు న్యూక్లియర్ పథకం గురంచి ప్రపంచద్రుక్పథం గురించి తెలిపే పత్రాలను కనుగొనుము. పత్రాలలో ఇరాన్ యొక్క న్యూక్లియర్ పథకం గురించి, పథకానికి వ్యతిరేకంగా అమెరికా నిరంతర రాజకీయ ఒత్తిది మరియు బెదిరింపులకు సంబంధించిన పత్రాలు, ఇరాన్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన సంధీ సంప్రదింపుల గురించిన పత్రాలు కూడా కలిగి ఉండాలి. 29 సునామీ మరియు దాని ప్రభావం 26 డిసెంబర్ 2004 న సునామీ కలిగించిన భీభత్సం, దాని కారణంగా ప్రభావితమైన లక్షలకొద్దీ జీవితాలు దిగ్భాంతి కరమైన, ఊహించలేకపోయినంత భీభత్సం కలిగించిన సునామీ గురించి, అది ప్రభావితం చేసిన జీవితాల గురించీ, వివిధ సంస్థలు అందించిన మానవతా సహకారం, అవస్థాపన సౌకర్యాల వైఫల్యం వల్ల తిండి, ఆరోగ్య సహకారం విషయం లో తలెత్తిన కరువు గురించి, ప్రజల ఆర్థిక-సామాజిక పరిస్థితుల గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 30 భారత రైల్వే శాఖా మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ భారతీయ రైల్వే శాఖా మంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ పాత్ర భారతీయ రైల్వే శాఖా మంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ పాత్ర,అవస్థాపనా సౌకర్యాల పరంగా రైల్వేస్ అభివృద్ధి, తన పదవీకాలం లో లాలూ సూచించిన రైల్వే బడ్జెట్ల మంచీ, చెడూ, గోద్రా రైలు ప్రమాద ఉదంతం తరువాత ఎంక్వైరీ కమిషన్ వేయడం లో లాలూ నిర్వహించిన పాత్ర వగైరా వివరాలు తెలుపు పత్రాలన్నీ సంబంధితమే. 31 భారత ఉపఖండం లో తీవ్రవాద దాడులు భారతదేశం లో ని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాద దాడులు. భారతదేశం లో జరుగుతున్న తీవ్రవాద ఘటనల గురించీ, ఈ దాడుల వెనుక ఉన్న వివిధ తీవ్రవాద ముఠాల హస్తం పై పోలీసుల ఆంచనాల గురించీ, బాధితుల సంఖ్య, ప్రభుత్వ సాయం గురించీ తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 32 కాంగ్రెస్ కీ, దాని మిత్రపక్షాలకీ మధ్య సంబంధాలు ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం లో పాలక కాంగ్రెస్ పార్టీకీ, దాని మిత్రపక్షాలకీ మధ్య ఉన్న సంబంధాలు కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన యూపీఏ కూటమి ఏర్పడడం దగ్గర్నుంచి, కాంగ్రెస్ పార్టీ కీ, దాని మిత్రపక్షాలైన సీపీఐ(ఎం), సీపీఎం, తెలుగుదేశం, జనతాదళ్ లతో దాని సంబంధాలూ, పార్టీ లో అమెరికా-భారత అణుఒప్పందం, ఆర్థిక సంస్కరణలు వంటి విషయాలపై ఉన్న అభిప్రాయభేదాల గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 33 ప్రెసిడెంట్ బుష్ భారత పర్యటన రెండో సారి రాష్ట్రపతి పదవిలో ఉన్న బుష్ తొలి భారత పర్యటన. బుష్ భారత పర్యటనను గురించిన సమాచారం, అణు ఒప్పందం జరిగే సూచనలు, ఆయన హైదరాబాద్ మరియు కొన్ని పల్లె ప్రాంతాల్లో పర్యటించే విషయం గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 34 జెస్సికా లాల్ హత్య కేసు జెస్సికా లాల్ హత్య మరియు ఆ కేసు. మోడల్ జెస్సికా లాల్ హత్య, తరువాత ఏడేళ్ళ పాటు సాగిన కేసు, చివరగా మనుశర్మ కు కోర్టు ఇచ్చిన యావజ్జీవ కారాగార శిక్ష లకు సంబంధించిన సమాచారం కావాలి. తక్కిన సమాచారం అవసరం లేదు. 35 భారతదేశం లోని వివిధ ప్రాంతాల్లో నక్సల్ దాడులు. వివిధ రాష్ట్రాల్లో నక్సల్స్ దాడులూ, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వీటిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు. పోలీసులపై, మరియు సామాన్యులపై నక్సల్స్ హింస కు సంబంధించిన నివేదికలు, నక్సల్ బాధిత ప్రాంతాల పోలీసులు, అధికారుల మధ్య సమావేశాలూ, నక్సల్స్ ని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు వంటి వాటి గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 36 నర్మదా డ్యాం కట్టడం పై వ్యతిరేకత వివాదాస్పదమైన ఆ డ్యాం నిర్మాణం గురించి నర్మదా బచావ్ ఆందోళన్ నిర్వహించిన నిరసన. వివాదాస్పద నర్మదా డ్యాం నిర్మాణం గురించీ, నర్మదా బచావ్ ఆందోళన్ నిర్వహించిన నిరసనల గురించీ, ఇందులో పర్యావరణ వేత్తలూ, నటులూ పాల్గొనడం గురించిన సమాచారం సంబంధితమైనది. ఈ డ్యాం వల్ల నిర్వాసితులయ్యే వేల కొద్దీ కుటుంబాలు, ఇది అక్కడి ప్రకృతి కి కలిగించబోయే ముప్పు గురించి తెలిపే పత్రాలు కూడా ఆసక్తికరమైనవే. 37 నేపాల్ లో మారుతున్న రాజకీయ పరిస్థితులు హిమాలయ రాజ్యం అయిన నేపల్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు . రాజకీయ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కుంచుకొని, రాజకీయ అవిశ్రాంతికి మరియు అల్లకల్లోలాలకు కారణమైన రాజా జ్ఞానేంద్ర గురించి తెలిపే పత్రాలు, మావోయిస్టు రెబెల్స్ నిరంతర ప్రచండమైన దాడులు, బహుళ జాతి వ్యవస్థ పై వారి సమాధానము తెలిపే పత్రాలు, చివరిగా వారి దిమాండ్లను అంగీకరించని ప్రభుత్వన్ని విడిచిన దని గురించి తెలిపే పత్రాలు కుడా సంబంధితమే . 38 వ్యాకుల పరుస్తున్న గ్రెగ్ ఛాపెల్-సౌరవ్ గంగూలీల సంధీ వివాదం వ్యాకుల పరుస్తున్న భారత కోచ్ గ్రెగ్ ఛాపెల్ మరియు భారత క్రికెట్ కాప్టన్ సౌరవ్ గంగూలీల వివాదం. చాపెల్ మరియు గంగూలీ ఇద్దరు పరస్పర నిందించుకుంతున్నత్తు తెలిపే పత్రాలు, బిసిసీఇ కు చాపెల్ ఈ-మెయిల్ బహిర్గతం అయిన ఉదంతాన్ని తెలిపే పత్రాలు, చాపెల్ పై పునర్విచారణ కమిటీ ఏఇర్పాటు చేసి వారి మధ్యనున్న వివాదన్ని తొలగించే ప్రయత్నాన్ని గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 39 బాగ్దాద్ లో పేలుళ్లు బాగ్దాద్ లో జరుగ్తున్న పేలుళ్లు . వరుసగా నగరంలో జరుగుతున్న పేలుళ్ళ గురించి, ఆత్మహుతి బాంబుల ప్రయోగం, పేలుళ్ళ వెనుక ఉన్న కారణాలు మరియు క్షతగాత్రుల సంఖ్యను తెలిపే పత్రాలు సంభందితమే. 40 పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ లో అవినీతి పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ లో అవినీతి మరియు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి మిస్టర్ ఇఫ్తికర్ మొహమ్మద్ చౌధురీ తొలగింపు గురించి తెలిపే పత్రాలను కనుగొనుము. సంబంధిత పత్రాలు న్యాయ వ్యవస్థ స్థాయిలో జరుగుతున్న అవినీతి మరియు దుష్ప్రవర్తన పేరిట పాకిస్తాన్ ప్రధాన న్యాయాధికారి తొలగింపు , రాష్ట్రపతి పర్వేజ్ ముషారఫ్ 'అధికార దుర్వినియోగం'. పాకిస్తాన్ లోని వివిధ వర్గాల ప్రజల మధ్య పెరుగుతున్న అసహనం, ఈ నిర్ణయం పట్ల పెద్దేత్తున నిరసనలు, పోలీసుల చేత నిరసనకారుల అరెస్టు, వందల కొద్దీ లాయర్ల నిరసన, అంతర్జాతీయంగా రాష్ట్రపతి ఎదుర్కున్న ఖండన మరియు చివరగా ముషారఫ్ వెనక్కి తగ్గి చౌధురి కి తిరిగి బాధ్యత అప్పజెప్పడం వంటి విషయాల గురించి తెలిపే పత్రాలన్నీ ఆసక్తికరమైనవే. 41 ఫ్రాన్స్ లో కొత్త కార్మిక చట్టాలు ఫ్రాన్స్ లో కొత్తగా అమలుచేసిన కార్మిక చట్టం గురించీ, అది ఎదుర్కున్న నిరసనల గురించీ తెలుపు పత్రాలను కనుగొనుము. ఫ్రాన్స్ పార్లమెంటు ప్రతిపాదించి, అమలుచేసిన తొలి ఉద్యోగ ఒప్పందం గురించిన సమాచారం, యూనియన్లు, యువతరం మరియు విద్యార్థులు ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన భారీ నిరసనలు, ఫ్రెంచి పోలీస్ విద్యార్థులపై చేసిన దాడి, సీపీఈ ని మూసివేయాలన్న అధ్యక్ష ప్రకటనా, చట్టాన్ని వెనక్కితీసుకోండి లేకుంటే వరుస సమ్మెలని భరించండి అని యూనియన్లు ప్రభుత్వానికి చేసిన బెదిరింపు -వీటికి సంబంధించిన ఏ పత్రాలైనా సంబంధితమే. 42 ఉత్తర కొరియా న్యూక్లియర్ ఒప్పందం :ప్రపంచ దృక్పథాలు ఉత్తర కొరియా మరియు దాని సామూహిక జనహనన ఆయుధాలు ఉత్తర కొరియా అణుపరీక్షలు మరియు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయన్న వారి ప్రకటన పై, అమెరికా ఆరు పార్టీల సమావేశానికి ఆహ్వానిస్తే కొరియా దాన్ని కాదని ద్విముఖ సమావేశానికి మాత్రమే సుముఖత చూపిన విషయం, ఈ విషయం పై ప్రపంచ నాయకుల అభిప్రాయాలు వంటి విషయాలపై సమాచారం అందించే పత్రాలన్నీ సంబంధితమైనవే. 43 విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ విధించడం విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య డ్రెస్ కోడ్ విధింపు విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో మరియు స్కూళ్ళలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య, ప్రధానంగా అమ్మాయిలకు డ్రెస్ కోడ్ విధించడం పై నివేదికలు, ఈ విషయం లో జరిగిన వాదోపవాదాలు, ఫలితంగా అధికారులు తీసుకున్న చర్యల గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 44 బ్రిటన్ లో తీవ్రవాద దాడులు లండన్ లో తీవ్రవాదుల వరుస పేలుళ్ళు 2005 లో నలుగురు ఆత్మాహుతి దళం తీవ్రవాదులు లండన్ లో కలిగించిన వరుస పేలుళ్ళ గురించిన వివరాలు, ఇటీవలి గ్లాస్గో విమానాశ్రయం పేలుడు వివరాలు - తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. బాధితుల సంఖ్య, పోలీసులు చేసిన అరెస్టులు వంటి వివరాలన్నీ ఆసక్తికరమైనవే. 45 గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ సూచనలు మరియు ఆ సమస్యకు పరిష్కారాలు గ్లోబల్ వార్మింగ్, దాని మూలాలు, భూమిపై దాని ప్రభావం, దాని వల్ల మనుష్యజాతి ఎదుర్కొనబోయే పరిణామాలు, దీని ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వ్యతిరేకించడానికి సంబంధిత ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 46 యాభై గంటల కష్టాల తరువాత బయటపడ్డ ప్రిన్స్ చీకటి బిలం లో యాభై గంటలు గడిపాక ఇల్లు చేరిన ప్రిన్స్ సంబంధిత పత్రాలు ప్రిన్స్ కుమార్ యాభై గంటలు ఓ గుంట లోని మూడడుగుల లోతున్న బిలం లో ఉండిపోయాక బయటపడ్డ విషయం గురించి చెప్పాలి. తక్కిన పత్రాలు సంబంధితమైనవి కావు. 47 నోబెల్ బహుమతి కనబడుటలేదు. బెంగాలీ కవి రబీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి దొంగిలించబడినది. ఆసియా లో మొదటి సారి సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ కవి మరియు రచయిత రబీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి మరియు ఆయనకి చెందిన మరికొన్ని అరుదైన చిత్రాలు, కళాఖండాలతో పాటు 25 మార్చి 2004 న దొంగిలించబడ్డాయి. దీని గురించిన సీబీఐ దర్యాప్తు అర్థాంతరంగా ఆగిపోయింది. వీటి గురించిన సమాచారం తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. ఇతర నోబెల్బహుమతి దొంగతనాల విషయాలతో ఇక్కడ సంబంధం లేదు. 48 నితారీ హత్య కేసు 2006 నోయిడా హత్య కేసు మరియు దానికి సంబంధించిన విచారణ నోయిడా లోని నితారీ గ్రామం లో జరిగిన వరుస పేలుళ్ళ గురించి, బాధితులు మరియు దారుణంగా చంపబడ్డ పిల్లలు, ఓ ఇరవైఏళ్ళ యువతి, ఇద్దరు అనుమానితుల అరెస్టు, పోలీసుల మరియు సీబీఐ దర్యాప్తు గురించి తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే. 49 ప్రపంచం లో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచం లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. సంబంధిత పత్రాల్లో ప్రపంచం లోని వివిధ ప్రాంతాల్లో సంభవిస్తున్న - అగ్ని పర్వతాలు బద్ధలవడం, సునామీ, గాలివానలు, కత్రినా, భూకంపం, వరదలు, ఉప్పెనలు, కొండచరియలు విరిగిపడ్డం వంటి ప్రకృతి వైపరిత్యాల గురించి, ప్రపంచం లోని వివిధ సంస్థలూ మరియు ప్రభుత్వాలూ అందిస్తున్న సహాయం గురించిన సమాచారం ఉండాలి. 50 కలకత్తా పుస్తక ప్రదర్శన - 2007 కలకత్తా పుస్తక ప్రదర్శన - 2007 మరియు దాని వేదికకు సంబంధించిన వివాదం సంబంధిత పత్రాలు ఈ పుస్తక ప్రదర్శన ఉద్ధేశ్యాల గురించి, కొత్త పుస్తకాల ఆవిష్కరణల గురించి, పుస్తక ప్రియుల స్పందనలు, ఆతిథ్యమిస్తున్న వేదిక గురించిన వివాదం, వేదిక మార్చాక అది చూపిన ప్రభావం, దానిపై పర్యావరణవేత్తలు లేవనెత్తిన అభ్యంతరాలు వంటి విషయాలపై సమాచారం తెలపాలి. 51 విద్యా వ్యవస్థలో అవినీతి. విద్యావ్యవస్థ లో అవినీతి వ్యాప్తి, నిరోధం. సంబంధిత పత్రాలు విద్యా రంగం లో విద్యార్థుల అడ్మిషన్ కోసం, గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో టీచర్ల నియామకం మరియు బదిలీల విషయం లో లంచాలు తీసుకున్న కథల గురించి తెలపాలి. 52 బుడ్జెట్ 2006-2007 2006-2007 ఆర్ధిక సంవత్సర బుడ్జెట్ అంచనాలు , దాని యొక్క ప్రభావం. మంత్రివర్గ విభాగలు చెప్పిన బుడ్జెత్ అంచనాలు మరియు ప్రతిపాదనల గురించి తెలిపే పత్రాలు, ప్రతిపదించిన బుడ్జెత్ చూపే ఆర్ధిక ప్రభావం, పేదరికానికి దిగువనున్న ప్రజల కొరకై చేపట్టబోయే అలోచనల గురించి తెలిపే పత్రాలు, బడ్జెట్ పై భారత ప్రజల విమర్శలను తెలిపే పత్రాలు సంబంధితమే. 53 భారత్-అమెరికాల అణు ఒప్పందం. ప్రజాప్రభుత్వ సంబంధించిన రెందు దేశాలు భారత్, అమెరికాల మధ్య అణు ఒప్పందం. ఇరు దేశాల మధ్య అమెరికా యొక్క న్యూక్లియర్ ఒప్పందం గురించి తెలిపే పత్రాలు, ఒప్పందందపు నియమాల గురించి తెలిపే పత్రాలు, దీని వెనుకనున్న లొసుగుల గురించి తెలిపే పత్రాలు, ఇరు దేశాలలో వివిధ పార్తీలు చేపట్టిన వ్యతిరేకత గురించి తెలిపే పత్రాలు, ఈ విషయం పై వెలువడే అనేక ప్రశ్నల గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 54 హెచ్.ఐ.వి మరియు ఎయిద్స్ తెగులు ప్రపంచబ్యాప్తంగా అన్నిటికంతే అతిపెద్ద ఆరోగ్యసంబంధిత విషయం హెచ్.ఐ.వి/ఎయిద్స్. హెచ్.ఐ.వి వచ్చే కారణాలు,వ్యాధి లక్షణాలు, వ్యాదిగ్రస్తులకు చికిత్స, క్రమేపి అభివ్రుద్ధి చెందుతున్న హెచ్.ఐ.వి రేటు, నివారణా చర్యలు మరియు మందుల గురించి తెలిపే పత్రాలు , హెచ్.ఐ.వి బాధితుల పై తోటి పౌరుల యొక్క ప్రతిస్పందన గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 55 సానియా మిర్జా తెన్నిస్ జీవితం భారత దేశ సంచలనాత్మక టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా అద్భుత టెన్నిస్ ప్రదర్శన ఘట్టాలు. సానియా మిర్జా ఇప్పటి వరకు తన టెన్నిస్ కెరీర్ లో సంపాదించిన అవార్డుల గురించి, ఆమె పొందిన అనేక సత్కారల గురించి తెలిపే పత్రాలు, సింగిల్స్ మరియు డబుల్స్ లో తన స్థానాన్ని గురించి తెలిపే పత్రాలు, ప్రస్తుత తన WTA స్థానం , రాబోయే తన ఆటల గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 56 మొబైల్ వినియోగదారుల పెరుగుదల రోజు రోజుకి పెరుగుతున్న మొబైల్ వినియోగం, 21వ శతాబ్దంలో వ్యసనంగా మారిన మొబైల్ వినియోగం గురించి తెలిపే పత్రాలు కనుగొనుము. రోజు రోజుకి పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల కలిగే నష్టాలు దాని నుంచి వెలువడే కిరణాల లక్షణాలు తెలిపేపత్రాలు, దీనిపై శాస్త్రవేత్తలు మరియు డాక్టర్ల యొక్క అభిప్రాయాలను తెలిపే పత్రాలు, సమాజంలో కెమెరా మొబైల్ వినియోగం వల్ల తలెత్తున్న సమస్యలను చర్చించే పత్రాలు సంబంధితమే. 57 అరుదైన జింకను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ అరుదైన జాతికి చెందిన జింకను చంపి అరెస్టు అయిన సల్మాన్ ఖాన్ . సల్మాన్ ఖాన్ జింకను చంపి అరెస్టు అయిన ఉదంతాన్ని తెలిపే పత్రాలు, అయిదు సంవత్సరాలు శిక్ష విధించిన కోర్టు ముందు సల్మాన్ ఖాన్ పెట్టుకున్న ఫిర్యాదును గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 58 థాయిలాండ్ లో కుట్ర కుట్ర కు సంబంధించిన నేతల కార్యకలాపాలు మరియు దాని తరువాత. సంబంధిత పత్రాల్లో థాయెలాండ్ లో పార్లమెంటు ని, సెనేట్ ని, రాజ్యాంగాన్నీ కుట్రదారులు రద్దు చేయడం, ఈ మిలటరీ కుట్ర సమయం లో మానవహక్కుల ఉల్లంఘన గురించన సమాచారం ఉండాలి.. 59 ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా పౌరుడి నిరసన అమెరికన్ పౌరులు యుద్ధం గురించి జార్జ్ బుష్ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పత్రాల్లో అమెరికన్ పౌరులు మరియు రాజకీయ పార్టీల నిరసన గురించీ, ఓ పెద్ద యుద్ధ వ్యతిరేక ర్యాలీ, ఎన్నో ప్రాంతాల్లో జరిపిన సమావేశాలు, బుష్ వ్యతిరేక టీ-షర్టులను ధరించినందుకు కొంతమంది అమెరికన్ పౌరుల అరెస్టు, జనం నుంచి యుద్ధం ఆపివేయమని పెరుగుతున్న వత్తిడి గురించిన సమాచారం ఉండాలి. 60 అల్-ఖైదా తీవ్రవాద కార్యకలాపాలు అల్-ఖైదా తీవ్రవాద కార్యకలాపాల గురించి తెలిపే పత్రాలను కనుగొనుము. సంబంధిత పత్రాలు అల్-ఖైదా తీవ్రవాద కార్యకలాపాల గురించి, దాని దాడికి గురైన దేశాల గురించి, ఫలితంగా కలిగిన మరణాలు, దాని కార్యకలాపాలు నిలువరించడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల గురించీ సమాచారం ఇవ్వాలి. 61 హారీ పాటర్ వెర్రితనం ప్రపంచ దేశలలో హారీ పాటర్ విడుదల సృష్టించిన వెర్రి . ప్రపంచలో పాటర్ విడుదల సృష్టించిన వెర్రి, అర్ధరాత్రి విడుదలైన పుస్తకాలు, పాటర్ అభిమనుల స్పందన, పుస్తకం యొక్క చలనచిత్ర విడుదల కోసం ఉత్కంఠటంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 62 కేంద్ర ప్రభుత్వంలో అవినీతి` అవినీతి కేసుల్లో చిక్కుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు . ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న అన్ని రకాల అవినీతిని గురించి తెలిపే పత్రాలు, సిబి ఐ ఇప్పటివరకు జరిపిన విచారణ, తీసుకున్న చర్యలు గురించి తెలిపే పత్రాలు, ఎసిబి చేపట్టిన అపరాధపరిశోధన , నివారణా చర్యలను చర్చించే పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు, అవినీతిని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 63 అంతుబట్టని నేతాజీ మరణం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణంపై వివిధ సందేహాలు, వితండవాదాలు. అంతుబట్టని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణం గురించి చర్చించే పత్రాలు, విమాన ప్రమాదంలో మరణించిన నేతాజీ గురించి ప్రభుత్వం విస్తరించింపజేసిన వార్తలుగురించి చర్చించే పత్రాలు , నేతాజీ మరణం గురించి తెలిపే దస్తవేజులు, రహస్య పత్రాలను బయటపెట్టని ప్రభుత్వం, నేతాజీ మరణం వెనుకనున్న నిజాన్ని బయటపెట్టమని డిమాండ్ చేస్తున్న భారత ప్రజల గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. వీటిని చర్చించని వేరే పత్రాలు ఎవి సంబంధిచినవి కాదు. 64 సభర్వాల్ హత్య కేసు ఎబివిపి విధ్యార్థుల చేత చంపబడిన ఉజ్జయిని ప్రొఫెసర్ హెచ్.ఎస్.సబ్ణర్వాల్ గురించి తెలిపే పత్రాలు కనుగొనుము. ఉజ్జయినిలో ప్రొఫెసర్ హెచ్.ఎస్.సబ్ణర్వాల్ ని ఎ బి వి పి విధ్యార్థులు నిర్దాక్షిణ్యంగా కొట్టి, చంపిన ఉదంతాన్ని తలిపే పత్రాలు, ప్రతికూలంగా సాక్ష్యం చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యులు, నిందితుల పై విచారణ, పోలిసుల తొలగింపు గురించి తెలిపే పత్రాలు సంబంధితమే.వేరే హత్య కేసులు ఏవి సంబంధిచినవి కావు. 65 దావూద్ ఇబ్రహీం వెతుకులాట లో సిబిఐ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కొరకు సిబిఐ నిరంతరం వెతుకులాట. ప్రపంచ తీవ్రవాది దావూద్ ఇబ్రహీం యొక్క ప్రసిద్ధ పనుల గురించి తెల్పే పత్రాలు, దావూద్ ని బంధించడం లో ఇంటర్ పోల్ ను సహాయం అడిగిన సి బి ఐ, దావూద్ యొక్క దేసియత పై సందేహాలు, చీకటి సామ్రాజ్యపు నాయకుదు దావూద్ ఇబ్రాహిం కు ఆశ్రయం కల్పించిన వారి పై ఒత్తిడి తీసుకురమ్మని అంతర్జాతీయ కమ్యూనిటి కు సి బి ఐ చేసుకున్న విజ్ఞప్తి గురించి తెలిపే పత్రాలు సంబంధితమే. 66 ఖాదిం అధినేత అపహరణ కేసు ఖాదిం అధినేత పార్థో ప్రతిం రాయ్ బర్మన్ అపహరణ కేసు ఖాదిం అధినేత అపహరణ కేసు గురించి తెలిపే పత్రాలు, ఎక్కువ మొత్తం లో డబ్బు అడిగిన కిడ్నాపర్ల గురించి చర్చించే పత్రాలు, నేరస్థుల అరెస్టు , ఉరి శిక్ష గురించి చర్చించే పత్రాలు, ఈ అపహరణ కేసు లో ఎఫ్ బి ఐ యొక్క ప్రమేయం గురించి చర్చించే పత్రాలు సంబంధితమే. 67 బోఫోర్స్ కుంభకోణం పునరుద్ధారణ బోఫోర్స్ కుంభకోణం, కుంభకోణం లో కాంగ్రెస్ తో కూడిన ఖత్రోచి ప్రమేయం గురించి చర్చించే పత్రాలు కనుగొనుము. మన్మోహన్ సింగ్ హయాం లో భారత రాజకీయ వ్యవస్థ పై బోఫోర్స్ కుంభకోణం ప్రాబల్యం గురించి చర్చించే పత్రాలు, ఖత్రోచి బ్యాంక్ అకౌంటు స్తభించకుండ ఉండేందుకు విపక్ష పార్టీల పాత్రను చర్చించే పత్రాలు, భారత ప్రభుత్వానికి ఖత్రోచిని అప్పగించడానికి నిరాకరించిన అర్జెంటీనా న్యాయస్థానం గురించి చర్చించే పత్రాలు, ఖత్రోచీకి వ్యతిరేకంగా ఇంటర్ పోల్ ఇచ్చిన రెడ్ కార్నర్ ప్రకటన గురించి చర్చించే పత్రాలు సంబంధితమే. 68 అమర్నాథ యాత్ర అమర్నాథ పవిత్ర యాత్ర, అందులో చోటుచేసుకున్న ఘట్టాల గురించి తెలిపే పత్రాలు కనుగొనుము. అమర్నాథ్ లింగం పవిత్రత, యాత్రికుల ప్రయాణం, అమాయక యాత్రికులపై తీవ్రవాదుల దాడులు, లింగం యొక్క పవిత్రత పై ఉన్న వివాదం గురించి చర్చించే పత్రాలు సంబంధితమే. 69 భారతీయ రైల్వే ప్రమాదాలు భారతీయ రైల్వే లో జరిగిన ప్రమాదాలు. సంబంధిత పత్రాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల గురించి, దాని తరువాతి విషయాలు, మృతుల మరియు గాయపడిన వారి సంఖ్య, ప్రభుత్వం అందిస్తున్న సాయం వంటి విషయాల గురించిన సమాచారం తెలపాలి. 70 బాలీవుడ్ లో రీమేక్ ల హవా బాలీవుడ్ లో వరుసగా పాత హిందీ సినిమాల రీమేక్‌ల పర్వం నడుస్తోంది.. సంబంధిత పత్రాల్లో బాగా ఆడిన, ఆడని రీమేక్ సినిమాల పేర్లు, చూసినవారి స్పందన, ఈ రీమేక్ ల గురించి దర్శకుల మరియు నటీనటుల వివరణ వంటి విషయాల గురించి సమాచారం ఉండాలి.మిగితా విషయాలు సంబంధితమైనవి కావు. 71 భారత్ నుండి హజ్ యాత్రికులు భారత్‌కు చెందిన ముస్లిం యాత్రికుల మక్కా సందర్శన. సంబంధిత పత్రాల్లో భారత్‌కు చెందిన ముస్లిం యాత్రికుల మక్కా సందర్శన, వీసా క్లియరన్స్ కోసం పోలియో టీకాలు వేయించుకోవాలి అన్న సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధన, హజ్ యాత్రికులకి సబ్సిడీ ఇవ్వడం గురించిన ప్రభుత్వ నిరాకరణ వంటి విషయాల గురించిన సమాచారం ఉండాలి . 72 స్టాంప్ పేపర్ కుంభకోణం ప్రభుత్వ స్టాంప్ పేపర్లని ఫోర్జరీ చేయడం లో నిందితులైన వ్యక్తులు. పెద్ద పదవుల్లో ఉన్న ప్రభుత్వాధికారులతో సహా, కొన్ని కోట్ల రూపాయల స్టాంప్ పేపర్ కుంభకోణం లో అరెస్టైన, తొలగింపబడ్డ నిందితుల గురించిన సమాచారం చెప్పే పత్రాలన్నీ సంబంధితమైనవే. తక్కిన పత్రాలు సంబంధితమైనవి కావు. 73 ప్రపంచకప్ లో మరో ఆటగాడిని తలతో ఢీకొన్న జినెదిన్ జిదానే 2006 ప్రపంచకప్ ఫైనల్ లో జినెదిన్ జిదానే తనని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు అన్న కారణం తో ఇటాలియన్ ఆటగాడు మటెరాజ్జీ ని తలతో ఢీకొన్నాడు. సంబంధిత పత్రాల్లో 2006 ప్రపంచకప్ ఫైనల్ లో జినెదిన్ జిదానే తనని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు అన్న కారణం తో ఇటాలియన్ ఆటగాడు మటెరాజ్జీ ని తలతో ఢీకొట్టిన సంఘటన గురించిన సమాచారం ఉండాలి. జిదానే క్షమాపణ గురించీ , మటెరాజ్జీ ని సిక్షించాలన్న అతని డిమాండ్ గురించీ, అతను బంగారు బంతి అవార్డు గెలవడం గురించిన సమాచారం తెలిపే పత్రాలు కూడా సంబంధితమైనవే. 74 భారత్ పాక్ సరిహద్దు రేఖ వివాదం భారత్-పాక్ సమస్యలు మరియు ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు రేఖ వివాదం పాకిస్తాన్ నుండి తీవ్రవాదులు సరిహద్దు రేఖ ద్వారా భారత్ పాలనలో ఉన్న కాశ్మీర్ లోకి చొచ్చుకు రావడం మరియు ఇరు దేశాల మధ్యా సరిహద్దు రేఖ వివాదం పరిష్కారం కావడానికి జరుగిన చర్చల గురించిన సమాచారం తెలిపే పత్రాలన్నీ సంబంధితమైనవే.తక్కిన పత్రాలు సంబంధితమైనవి కావు. 75 బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి గార్డన్ బ్రౌన్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం గురించిన పత్రాలను కనుగొనుము. గార్డన్ బ్రౌన్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం, ప్రధానమంత్రి గా గార్డన్ బ్రౌన్ ఎన్నిక పట్ల లేబర్ పార్టీ నిర్ణయం, పద్ధతులు - ప్రమాణాలూ, వాటి వల్ల లేబర్ పార్టీ కి కలిగే లాభ నష్టాల గురించి బ్రౌన్ మరోసారి బేరీజు వేయడం గురించిన పత్రాలన్నీ సంబంధితమైనవే.